వరద బాధిత కుటుంబాలకు సిఎం జగన్ శుభవార్త చెప్పారు. వరద ప్రభావిత జిల్లాల్లో నిత్యవసరాల పంపిణీకి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు సిఎం జగన్. వరద బారిన పడిన కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ వంటనూనె, కేజీ ఉల్లిగడ్డలు, కేజీ బంగాళా దుంపలు ఉచితంగా పంపిణీ చేయాలని ఏపీ సిఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
అలాగే వరద ప్రాంతాల ప్రజాప్రతినిధులు అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి వైయస్ జగన్. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు తక్షణ సహాయం అందేలా చూడాలన్నారు సీఎం.
జరిగిన నష్టంపై అంచనాలు, పంటలు పూర్తిగా దెబ్బతిన్న రైతులు తిరిగి పంటలు సాగు చేసేలా విత్తనాలు వంటివి అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడికక్కడ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు తోడుగా నిలవాలని పేర్కొన్నారు ఏపీ సిఎం జగన్.