జాతీయ పార్టీలు కేవలం కాంగ్రెస్, బీజేపీ మాత్రమే : జగ్గారెడ్డి

-

టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా ఎన్నికల సంఘం ఆమోదం తెలపడంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ కు ఎవరు అప్లికేషన్ పెట్టుకున్న అనుమతి ఇస్తారన్నారు. జాతీయ రాజకీయాల్లో రావాలని టీఆర్‌ఎస్‌ వాళ్ళు అనుకుంటున్నారని, ఇప్పటి వరకు ప్రాంతీయ పార్టీల వారు జాతీయ పార్టీ పెట్టి విజయం సాధించలేదన్నారు. మమత బెనర్జీ, చంద్రబాబు, ములాయం సింగ్ లాంటి వారు జాతీయ పెట్టి విజయం సాధించలేదని ఆయన అన్నారు. జాతీయ పార్టీలు కేవలం రెండు మాత్రమే కాంగ్రెస్, బీజేపీ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇతర రాష్టాలలో కాంగ్రెస్ నష్టపోవడానికి కారణం ఎంఐఎం, ఇతర పార్టీలు అని ఆయన ఆరోపించారు. ఎప్పుడు హైద్రారాబాద్ దాటని ఎంఐఎం పార్టీ కూడా ఇతర రాష్టాలలో పోటీ చేస్తుందని, చాలా రాష్టాలలో బీజేపీకి సపోర్టుగా ఆప్, ఎంఐఎం పోటీ చేస్తోందన్నారు. గుజరాత్ లో బీజేపీ కుట్ర చేస్తుందని, అందుకే గెలుస్తుందన్నారు.

Jagga Reddy: షర్మిల, అనిల్‌ది కబ్జాల చరిత్ర: జగ్గారెడ్డి సంచలనం,  తోడికోడళ్లమంటూ రేవంత్‌తో! - Telugu Oneindia

అంతేకాకుండా.. ‘హిమాచల్ ప్రదేశ్ లో ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతుంది. రాష్ట్రంలో టిఆర్ఎస్ గ్రాఫ్ తగ్గింది. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ కు పోకుండా బీజేపీకి పోయేలా చేస్తున్నారు. ధన బలం మీడియాతో కుట్రలు చేస్తున్నారు. తెలంగాణలో బిజెపికి కాంగ్రెస్ రావద్దు ,టిఆర్ఎస్ వచ్చిన పర్లేదు అన్నటుంది. టిఆర్ఎస్ ,బిజెపి డ్రామా చూస్తుంది.’ అని ఆయన వ్యాఖ్యానించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news