జ‌మ్మూక‌శ్మీర్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఘ‌ర్ష‌ణ

-

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ‌క్ఫ్ బిల్లు చర్చనీయాంశమవుతోంది. అయితే ఈ బిల్లుపై చ‌ర్చ చేప‌ట్టాల‌ని జమ్మూక‌శ్మీర్ అసెంబ్లీలో మూడు రోజుల‌గా వాయిదాల ప‌ర్వం న‌డుస్తోంది. ఇవాళ ఈ విషయంలో శాసనసభ ప్రాంగణంలో కొందరు ఎమ్మెల్యేలు ఘర్షణ పడ్డారు. వీరు గొడవ పడుతున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎమ్మెల్యేల ఘర్షణతో శాసనస‌భ‌ను మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు వాయిదా వేశారు.

అసెంబ్లీలో లోప‌ల ఆప్ ఎమ్మెల్యే మెహ‌రాజ్ మాలిక్‌, పీడీపీ ఎమ్మెల్యే వ‌హీద్ పారా మ‌ధ్య వక్ఫ్ బిల్లుపై చర్చ వీషయంలో తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. ఈ నేపథ్యంలో రెండు వ‌ర్గాలుగా విడిపోయిన ఎమ్మెల్యేలు.. ఒక‌రిపై ఒక‌రు దూష‌ణ‌లు చేసుకోవడమే గాక అనంతరం దాడులు చేసుకున్నారు. దీంతో స్పీకర్ అబ్దుల్ రహీమ్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. గత రెండ్రోజుల నుంచి ఇలాగే సభ వరుసగా వాయిదా పడుతూ వస్తోంది. ఇవాళ ఉదయం సభ ప్రారంభం కాగానే అధికార నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ స‌భ్య‌లు వెల్‌లోకి దూసుకెళ్లిన నినాదాలు చేశారు. ఇటీవ‌ల కేంద్రం ఆమోదించిన వ‌క్ఫ్ బిల్లుపై చ‌ర్చ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news