రిలయన్స్ నుంచి కొత్త ల్యాప్‌టాప్ అందుబాటులోకి వచ్చింది. రిలయన్స్ తన తొలి ల్యాప్‌టాప్ జియో బుక్‌ను లాంచ్ చేసింది. ఈ ల్యాప్‌టాప్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022లో ప్రదర్శించారు. ఆ తర్వాత ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా విడుదలైంది. అయితే, కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పరిమితమైంది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కొనుగోలు చేసే అవకాశాన్ని ఇచ్చింది. అంతేకాదు. రూ. 35,000 కంటే ఎక్కువ ధర కలిగి ఉన్నా.. భారీ తగ్గింపు ధరకు వస్తుంది.updatesu

జియోబుక్ ధర..ఆఫర్లు..
JioBook ధర రూ.35,605. అయితే, ఇది రూ.15,799 డీల్ ధరతో రిలయన్స్ డిజిటల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. కస్టమర్లు నిర్దిష్ట బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై (యస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్) మరింత తగ్గింపు ధరను ధరను పొందే అవకాశం ఉంది.
నెలకు రూ. 758.56 నుంచి మొదలయ్యే EMIలను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం JioBook నీలం రంగులో మాత్రమే అందుబాటులో ఉంది.
అంతేకాదు, వినియోగదారులకు JioBook 1-సంవత్సరం వారంటీతో అందిస్తుంది.
జియోబుక్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..
Google, Microsoft సహకారంతో అభివృద్ధి చేయబడిన, JioBook రిలయన్స్ కంపెనీకి చెందిన JioOSపై రన్ అవుతుంది.
ఇది 1,366×768 పిక్సెల్‌ల రిజల్యూషన్ తో 11.6-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది.
JioBook 2GB RAM, 950MHz Adreno GPUతో జతచేయబడిన ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది.
స్టోరేజీ కోసం 32GB eMMC ఫ్లాష్ మెమరీతో వస్తుంది. దీనిని 128GB వరకు (మైక్రో SD కార్డ్ ద్వారా) విస్తరించవచ్చు.
కనెక్టివిటీ కోసం, JioBook Wi-Fi (802.11ac), LTE (B3, B5, B40) మరియు బ్లూటూత్ v5కి మద్దతు ఇస్తుంది.
ఇది HDMI మినీ పోర్ట్, 3.5mm ఆడియో జాక్ మరియు మైక్రోUSD కార్డ్ రీడర్‌తో వస్తుంది.
ఆడియో రెండు 1W స్పీకర్ల ద్వారా వస్తుంది.
JioBook 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. 1.5 కిలోల బరువుతో తేలికగా ఉంటుంది