మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. పూర్తి వివరాల లోకి వెళితే.. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
అసిస్టెంట్ ప్రొఫెసర్లు గ్రేడ్-1 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తోంది. మ్యాథమెటిక్స్ అండ్ స్టాటస్టిక్స్, ఫిజిక్స్, హ్యుమానిటిస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగాలతో పాటు కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఖాళీల కోసం దరఖాస్తులని ఆహ్వానిస్తోంది.
టీచింగ్/ రిసెర్చ్/ ఇండస్ట్రియల్ అనుభవంతో పాటు పీహెచ్‌డీ/ తత్సమాన ఉత్తీర్ణత సాధించిన వాళ్లు అప్లై చెయ్యచ్చు. వయస్సు విషయంలోకి వస్తే.. 38 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎస్సీలకు ఐదేళ్లు, ఓబీసీ-ఎన్‌సీఎల్ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, పీడబ్ల్యూడీలకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది.
ఎంపికైన వాళ్లకి నెలకు 1,01,500 రూపాయల వేతనంతో పాటు ఇతర అలవెన్సులను పొందచ్చు. 2021 సంవత్సరం డిసెంబర్ 24వ తేదీ లోగ అప్లై చేసుకోవాలి. ఆన్ లైన్ విధానం లో అప్లై చెయ్యాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. పూర్తి వివరాలని https://www.iittp.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకొచ్చు.
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్, వింతలు విశేషాలు, ప్రేరణాత్మక కథనాల కోసం మనలోకం.కామ్ ని ఫాలో అవ్వండి.