జూబ్లీహిల్స్‌లో డ్రైవ్ ఇన్ పేరుతో 13 కోట్లు కుచ్చుటోపి

-

మోసాలకు కాదేది అనర్హం అన్నట్లు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవల ఓ మటన్‌ షాపు యజమానికి ఫోన్‌ చేసి మటన్‌ కావాలంటూ కొందరు సైబర్‌ నేరగాళ్ల రూ.75 వేలు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పడు మరో మోసం వెలుగులోకి వచ్చింది. జూబ్లీ హిల్స్ లో డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ లో పెట్టుబడి పేరుతో 13 కోట్ల మోసం తెరలేపారు కొందరు మోసగాళ్లు. క్యూబా డ్రైవిన్ ఫూడ్ కోర్ట్ లో పెట్టుబడి పెడితే భారీగా వాటా ఇస్తానని పలువురిని నమ్మించి 13 కోట్ల రూపాయలు వసూలు చేశారు ఘరానా మోసగాళ్లు. అయితే.. డబ్బులు వసూళ్లకు పాల్పడిన తరువాత ఎలాంటి సమాచారం లేకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించారు. దీంతో.. కేసు నమోదు చేసుకున్న సీసీఎస్‌ పోలీసులు ప్రధాన నిందితుడు నాగిల్లా జసింత్, సుకన్య నాగిల్లా అనే ఇద్దరు నిందితులు అరెస్ట్ చేశారు.

Online fraud: Recover stolen money within 10 days - Here's how

ఇద్దరి నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయితే.. . వీరిద్దరూ తల్లి కొడుకులని, తండ్రి రూఫస్ నాగిల్లా పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుని కోసం గాలిస్తున్నా సీసీఎస్‌ పోలీసులు పేర్కొన్నారు. నిందితులపై పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు రూఫస్ నాగిల్లా చర్చి పాస్టర్ గా వ్యవహరిస్తూ చర్చికి వచ్చిన వారి వద్ద నుండి భారీగా డబ్బులు వసూలు చేసి బాధితులను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news