కృష్ణంరాజు నటించిన చిత్రం గురించి న్యాయమూర్తులు, అధికారుల చర్చ.. ఆ సినిమా ఇదే..

-

టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు విభిన్నమైన చిత్రాలు తీసి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ఓ చిత్రం చూసి న్యాయమూర్తులు, న్యాయ శాఖ అధికారులు చర్చించుకున్నారట. ఆ సినిమా ఏదో ఇప్పుడు తెలుసుకుందాం.

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు – కృష్ణంరాజు కాంబోలో వచ్చిన చిత్రాలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. వారి కాంబోలో వచ్చిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘బొబ్బిలి బ్రహ్మన్న’. కృష్ణంరాజు నిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పైన ఈ సినిమా ను ప్రొడ్యూస్ చేశారు. ఈ చిత్రానికి మూడు నంది అవార్డులతో పాటు ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా వచ్చింది.

ఇందులో గ్రామ పెద్దగా ‘బ్రహ్మన్న’గా కృష్ణంరాజు నటనను చూసి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ చిత్రానికి స్టోరి, మాటలు పరుచూరి బ్రదర్స్ అందించగా, రాఘవేంద్రరావు స్క్రీన్ ప్లే ఇవ్వడంతో పాటు దర్శకత్వం వహించారు.

ఇక ఈ సినిమాలో ఓ సన్నివేశంలో నేరం జరిగినట్లు ఆరోపణలు రాగా, ఆ ప్రాంతానికి వెళ్లినట్లు దర్శకులు చూపించారని, అది న్యాయం చేయడానికి ఉపయోగపడే అంశమని జడ్జిలు తెలిపారు. సినిమాలో మాదిరిగా నిజ జీవితంలో ఏదైనా ఘటన జరిగినపుడు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలన చేయాలనేది తప్పనిసరి అని పేర్కొన్నారు. కృష్ణంరాజు-రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన ‘అమరదీపం’, ‘బొబ్బిలి బ్రహ్మన్న’, ‘అడవి సింహాలు’ చిత్రాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version