12 మంది జంపిగులపై ఫిర్యాదు..బాబుకు రేవంత్ రాజీనామా!

-

బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలని బీజేపీకి చెందిన కొందరు కొనుగోలు చేసే ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశాన్ని పకడ్బంధీగా ప్లాన్ చేసి..నిండుతులని కేసీఆర్ ప్రభుత్వం పట్టుకుంది. ఇక వారు అరెస్ట్ అవ్వడం, బెయిల్ పై బయటకు రావడం..ఈ కేసుని సీబీఐకి ఇవ్వాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం, ఆ తీర్పుని మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం సవాల్ చేసి హైకోర్టు డివిజన్ బెంచ్‌ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ కొనసాగుతుంది.

ఇదిలా ఉంటే తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలని ప్రలోభాలకు గురి చేసి..బీఆర్ఎస్ పార్టీలోకి లాక్కున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు టి‌పి‌సి‌సి రేవంత్ రెడ్డి సిద్ధమైన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున గెలిచిన వారిలో 12 మంది ఎమ్మెల్యేలు కారు పార్టీలోకి జంప్ చేసిన విషయం తెలిసిందే. అలా జంప్ చేసిన వారికి రాజకీయంగా, ఆర్ధికంగా ప్రయోజనాలు లభించాయని, ప్రభుత్వం నుంచి ఏయే పనులు చేయించుకున్నారనే అంశాలు బయటకు రావాలని చెప్పి రేవంత్ ఫిర్యాదు చేయనున్నారు.

అంటే ఏదో లబ్ది ఆశించే వారు కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్ లో చేరారని ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తరుపున ఎల్బీ నగర్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి..బీఆర్ఎస్ లోకి జంప్ చేసిన విషయం తెలిసిందే.  ఇక రేవంత్ ఫిర్యాదుపై..ఆయన తాజాగా స్పందించారు. గతంలో రేవంత్ రెడ్డి టీడీపీని వదిలేప్పుడు స్పీకర్‌కు ఇవ్వాల్సిన రాజీనామా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇచ్చారని, ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారని, నెక్స్ట్ 20 రోజుల వ్యవధిలో ఎమ్మెల్యేగా రేవంత్ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు.

అప్పుడు రేవంత్ ప్రజలని మభ్య పెట్టారని ఆరోపించారు. ఇక తాము రాజ్యాంగబద్ధంగా బీఆర్ఎస్‌లో విలీనమయ్యామని, పార్టీ మారే విషయంలో రేవంత్ డిబేట్‌కు రావాలని సవాల్ విసిరారు. గతంలో ఆర్ధిక ప్రయోజనాలు ఆశించే రేవంత్ కాంగ్రెస్ లోకి వచ్చారా? అని ప్రశ్నించారు. అయితే టీడీపీ నుంచి గెలవడంతో ఎమ్మెల్యే పదవి రాజీనామా లేఖ చంద్రబాబుకు ఇచ్చానని, అలాగే తాను ఆర్ధిక ప్రయోజనాలు ఆశిస్తే..అధికార పార్టీలోకి వెళ్ళేవాడినని, కానీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ లోకి వచ్చానని రేవంత్ పలుమార్లు చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news