ఈ రాశుల వారికి ఈరోజు వ్యవహారాలలో విజయం సాధిస్తారు..

-

మేషం..

ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం..అధికారులతో మాటలు పడాలి..

వృషభం

చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.. విందువినోదాలు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి. విందువినోదాలలొ సన్నిహితులతో పాల్గొంటారు..

మిథునం

ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వాహనయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు..కొత్త రుణాలు లాభిస్తాయి..

కర్కాటకం

కుటుంబంలో ఒత్తిడులు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవచింతన. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలలో లాభాలు ఉండవు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి..

సింహం

ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. సోదరులతో విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

కన్య 

చేపట్టిన పనులు సవ్యంగా సాగుతాయి.. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. సంఘంలో గౌరవం. వస్తు, వస్త్రలాభాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. దైవదర్శనాలు, దూర ప్రయాణాలు చేస్తారు.

తుల 

బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. పనుల్లో అవాంతరాలు. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు..కీలక విషయాలలో జాగ్రత్త..

వృశ్చికం

పాత వివాదాలు పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయ దర్శనాలు. పనులలో పురోగతి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి, కొత్త ఉద్యోగం, వాహన వియోగం..

ధనుస్సు

చేపట్టిన ముఖ్యమైన పనులు ఈరోజు వాయిదా పడతాయి..ఆర్థిక లాభాలు తక్కువ, ఖర్చులు అధికం.. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.. భూవివాదాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో బాధ్యతలు చికాకులు..

మకరం

కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి..ఈరోజు మంచి రోజు..

కుంభం

శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది.. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి..

మీనం

మిత్రులతో శుభ కార్యాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. దైవదర్శనాలు. ఆస్తి వివాదాలు. శ్రమకు ఫలితం కనిపించదు. వ్యాపారాలలో లాభాలు స్వల్పమే. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి..ఈరోజు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి..

Read more RELATED
Recommended to you

Latest news