జూనియర్ ఆర్టిస్ట్ పై అత్యాచారం కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు

-

పలు యాడ్ ఫిల్మ్ లో నటిస్తూ పోలీసులు ప్రియాంత్ రావూను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో వంచించి అత్యాచారం చేశాడంటూ ప్రియాంత్ పై జూనియర్ ఆర్టిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారంతోపాటు కులం పేరుతో దూషించాడంటు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రియాంత్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.

బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, “కొత్తగా మా ప్రయాణం” సినిమా హీరో ప్రియాంత్ కు జూనియర్ ఆర్టిస్టు తో పరిచయం ఏర్పడింది. పరిచయమైన రెండు నెలల తర్వాత ఆమెకు ప్రియాంత్ ప్రపోజ్ చేశాడు. అప్పటి నుంచి వారి ప్రేమ ప్రయాణం కొనసాగింది. ఈ క్రమంలో ఒకరోజు హైదరాబాద్ శివారు లో ప్రగతి రిసార్ట్ కు తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి అత్యాచారం చేసినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా శ్రీనగర్ కాలనీలో ఉన్న కార్యాలయానికి తీసుకెళ్లి పలుమార్లు లైంగికంగా వేధింపులకు గురి చేసినట్లు వెల్లడించింది. చివరకు బాధితురాలు గర్భం దాల్చడంతో నిందితుడు మొహం చాటేసినట్లు ఆమె తెలిపింది. ఈ కేసులో ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news