బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ కే. లక్ష్మణ్ కు బీజేపీ పార్టీ రాజ్యసభ అవకాశం కల్పించింది. ఆయన ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికకాబోతున్నారు. నిన్న రాత్రి స్వయంగా లక్ష్మణ్ కు ఫోన్ చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పార్టీ నా బాధ్యతను పెంచిందని.. నేను రాజ్యసభను ఆశించలేదన లక్ష్మణ్ అన్నారు. లక్నోకు వచ్చి నామినేషన్ దాఖలు చేయాల్నిందిగా అమిత్ షా కోరారని అన్నారు. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన నన్ను పార్టీ గుర్తించిందని.. జాతీయ స్థాయిలో నా సేవలను అందించడంతో పాటు తెలంగాణకు న్యాయం చేస్తామని అన్నారు. తెలంగాణలో బీజేపీని అధికారంలో తీసుకురావడమే లక్ష్యమని లక్ష్మణ్ అన్నారు. తెలంగాణపై బీజేపీ ప్రత్యేకంగా చూస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని.. 8 ఏళ్లుగా ఈ ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేఖతతో ఉన్నారని.. వారికి బీజేపీ భరోసా ఇస్తోందని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేవ్ నుంచి యోగీ ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో పనిచేయడం మరింత సంతోషాన్ని ఇస్తోందని ఆయన అన్నారు.
రాజ్యసభకు లక్ష్మణ్.. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం
-