RRR ఎందుకు RGV సినిమాలు చూడండి..కేఏ పాల్‌ వీడియో వైరల్‌ !

-

వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌.. టాలీవుడ్‌ దర్శకులు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఆయ‌న ఏది చేసినా.. వివాదంలాగే ఉంటుంది. ఆయ‌న నోటి దూలతో ఆయ‌న డైలాగ్స్.. ఆయ‌న చేతి దూలతో ట్వీట్స్ ఎప్పుడు వార్త‌లో ఉంటాయి. ఇక ట్విట్ట‌ర్ లో వ‌ర్మ చేసే.. హంగామా అంతా ఇంతా ఉండ‌దు. ఎప్పుడు ఎదో ఒక ట్వీట్ పెట్టి వివాదాల‌ను రేపుతారు.

ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న ట్వీట్స్ కాస్త ఎక్కువ‌గానే వ‌స్తున్నాయి. కేఏ పాల్ పై ఫోక‌స్ పెట్టి ఈ మ‌ధ్య కాలంలో వ్య‌గ్యంగా ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా కేఏ పాల్‌ వీడియోను వ్యగ్యంగా చేసి రామ్ గోపాల్ వ‌ర్మ..తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తాజాగా అప్సరా, ననై గంగూలీలతో డేంజరస్‌ అనే మూవీ తీశాడు వర్మ.

ఈ మూవీ.. ఏప్రిల్‌ 8 న తేదీన విడుదల కానుంది. అయితే.. ఆ మూవీ ప్రమోషన్స్‌ కోసం.. కేఏ పాల్‌ ను వాడుకున్నాడు వర్మ. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా వద్దు.. ఏప్రిల్‌ 8 న తేదీన విడుదల కానున్న డేంజరస్‌ సినిమాను చూడాలని కేఏ పాల్‌ చెప్పినట్లు… వీడియోను ఎడిట్‌ చేసి.. సోషల్‌ మీడియాలో పెట్టాడు ఆర్జీవీ. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version