వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌దే విజయం : కడియం శ్రీహరి

-

బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, తెలంగాణలో ఎన్నికలు ఏవైనా బీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు. మూడోసారి అధికారంలోకి రావడం ఖాయం అన్నారు కడియం. నాగార్జున సాగర్ నియోజకవర్గం తిరుమలగిరిసాగర్ లో శనివారం నిర్వహించిన బీఆర్‌ఎస్‌ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా వచ్చారు కడియం. అక్కడ మాట్లాడుతూ. గడిచిన 35 ఏళ్లలో మాజీ మంత్రి జానారెడ్డి నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని, 70 ఏండ్లలోనూ ఆయన చేయబోయేది కూడా ఏమీ లేదని అన్నారు ఆయన. సాగర్ వెనుక బాటుతనానికి జానారెడ్డె కారణమని మండిపడ్డారు. గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్ గారిదేనని పొగిడారు కడియం. కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీ ప్రతిష్టకు కృషి చేయాలని సూచించారు.

‘ తెలంగాణలో బీజేపీ పార్టీకి ఉనికి లేదు. కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ లేదు.కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ’ అని ఎద్దేవా చేశారు.దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లు, బీజేపీ 15 ఏళ్లు పరిపాలించినా ఏ మార్పు రాలేదని అని వెల్లడించారు కడియం. ‘తొమ్మిదేండ్లలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించింది.రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమ’ని అన్నారు ఆయన. రాష్ట్రంలో బండి సంజయ్, రేవంత్ రెడ్డి భాష అభ్యంత్యకరమని వారి పై మండిపడ్డారు. దేశంలో ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కేందుకే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ నాయక్, ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్‌, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, మాజీ ఆప్కాబ్ చైర్మన్ యడవెల్లి విజయందేర్ రెడ్డి, పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version