కోటం రెడ్డి పై ఫైర్ అయిన కాకాణి, ఆదాల ప్రభాకర్ రెడ్డి

-

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ లోకి వెళ్లేందుకే ప్రభుత్వం పై అభాండాలు బురద చల్లుతున్నారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణ ఓ పెద్ద ట్రాష్ అని.. జరిగింది ఫోన్ టాప్ కాదని.. చంద్రబాబు చేసిన ట్రాప్ అని అన్నారు. కోటంరెడ్డి ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తే మీడియాకు వాస్తవం వెల్లడించారని చెప్పారు. ట్యాపింగ్ ఆరోపణ నిజమైతే కోటంరెడ్డి కోర్టుకు ఎందుకు వెళ్ళలేదని మంత్రి కాకాణి అడిగారు. పెంచిపోషించిన పార్టీకే ద్రోహం చేశారని, కోటంరెడ్డికి ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయని మండిపడ్డారు. రూరల్ నియోజక వర్గ ముఖ్యనేతలంతా పార్టీలోనే కొనసాగుతున్నారని, వాపును చూసి కోటంరెడ్డి బలుపని భ్రమపడుతున్నారని మంత్రి కాకాణి వ్యక్తపరిచారు.

మరోవైపు ఎమ్మెల్యే కోటంరెడ్డిపై ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తపరిచారు. మీడియా సమావేశాలు పెట్టి అబద్దాలు మాట్లాడటం చాలా తప్పని అన్నారు. కోటంరెడ్డి గుట్టు త్వరలోనే ప్రజల దగ్గర విప్పుతామన్నారు. ఎంతమందిని ఏ విధంగా వేధించారో ప్రజలకి తెలుసన్నారు. తానే రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానన్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే కంటే తనకు 5 వేల ఓట్లు రూరల్‌లో ఎక్కువగా వచ్చాయని ఆదాల పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్, హోటల్స్, వ్యాపారస్థులు నిన్నటి వరకు హడలిపోతున్నారని.. కాంట్రాక్టర్‌గా వచ్చాను కాబట్టే ప్రజా సేవ చేస్తున్నానని ఆదాల ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news