చిత్ర పరిశ్రమలో విషాదం.. కరోనాతో ప్రముఖ దర్శకుడు మృతి

చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. 2020 నుంచి ఇప్పటి వరకు చాలా మంది ప్రముఖులను కోల్పోయింది చిత్రపరిశ్రమ. అయితే తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. కరోనా బారిన పడిన ప్రముఖ దర్శకుడు ప్రదీప్ రాజు మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ రాగా.. కుటుంబ సభ్యులు ఆయనను బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.

అప్పటి నుంచి అక్కడే ఆయన చికిత్స పొందుతున్నారు. కాగా నిన్న చికిత్స తీసుకుంటూనే… తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు పేర్కొన్నారు. కరోనా కు తోడు గత 15 సంవత్సరాలు గా ఆయన మధుమేహం తో బాధ పడుతున్నారని… దీంతో ఆరోగ్యం బాగా క్షీణించిందని వైద్యులు తెలిపారు. చికిత్సకు ఆయన శరీరం సహకరించలేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యం లోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలిసిన సినీ పరిశ్రమ ప్రముఖులు ఆయన కు సంతాపం తెలిపారు