కాంతారా: హాట్ టాపిక్ గా మారిన హీరో రెమ్యునరేషన్..!

-

ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయ దిశగా నిలిచిన చిత్రం కాంతారా. ఈ సినిమా విడుదలై ఎన్నో సంచలనాలు సృష్టించింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటి లో కూడా బాగానే ఆకట్టుకుంటోంది. సరికొత్త కథనం కాకపోయినా అద్భుతమైన సన్నివేశాలు ఉండడంతో ఈ సినిమా సక్సెస్ కు కీలకమైందని చెప్పవచ్చు. ఈ సినిమా లో హీరోగా రిషబ్ శెట్టి నటించడమే కాకుండా స్వయంగా తానే దర్శకత్వం కూడా వహించారు. ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో పేర్లను సంపాదించింది.

కాంతారా సినిమా సక్సెస్ కావడంతో రిసెప్ శెట్టి నటించిన గత చిత్రాలు తెలుగులో డబ్ చేసి విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ లో కూడా ప్రస్తుతం ఈ నటుడుతో సినిమాలు తెరకెక్కించడానికి చాలా ఆత్రుతగా ఉన్నారు.ఈ స్టార్ హీరో మాత్రం చాలా తక్కువ రెమ్యూనరేషన్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాంతారా మూవీకి హీరోగా డైరెక్టర్ గా పని చేసినందుకు రిసెప్ట్ శెట్టి ఈ సినిమాకి కేవలం రూ.6 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిర్మాతలకు మాత్రం కళ్ళు చెదిరే లాభాలను అందించడంతో నిర్మాతలు సినిమా రిలీజ్ తర్వాత మరొక రూ.5 కోట్ల రూపాయలు రెమ్యూనికేషన్ ఇచ్చినట్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

రూ.400 కోట్ల రూపాయల కలెక్షన్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాకి నటుడు రిషబ్ శెట్టి కేవలం రూ.11 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ నటుడుకి ఇది చాలా తక్కువే..అయినప్పటికీ రాబోయే రోజుల్లో పాన్ ఇండియా హీరోలకు దీటుగా తన రెమ్యూనరేషన్ తీసుకునే అవకాశాలు ఉన్నట్లు అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version