పవన్‌కు ‘కాపు’ కాసేలా..స్కెచ్ అదిరింది..!

-

ఇటీవల ఏపీ రాజకీయాల్లో కాపు నేతల వరుస భేటీలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. పైగా వంగవీటి రంగా వర్ధంతిని పురస్కరించుకుని..డిసెంబర్ 26న కాపునాడు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి గంటా శ్రీనివాసరావు లీడ్ వహిస్తున్నారు. కాపునాడుకు సంబంధించి ఇటీవల కొందరు కాపు నేతలు గంటాతో సమావేశమైన విషయం తెలిసిందే. అలాగే కాపునాడుకు అన్నీ పార్టీల్లో ఉన్న కాపు నేతలకు ఆహ్వానాలు వెళుతున్నాయి.

ఇదే క్రమంలో తాజాగా గంటా, బోండా ఉమా, కన్నా లక్ష్మీనారాయణ, యడం బాలాజీ..విజయవాడలో సమావేశమయ్యారు. అయితే  కాపు నేతల సమావేశాల్లో వైసీపీ నేతలు కనిపించడం లేదు. ఇదివరకే వారు సెపరేట్ గా సమావేశం పెట్టుకుని..పవన్‌కు కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కాపు నేతల సమావేశాలు..పవన్‌ని బలపర్చడానికే అని తెలుస్తోంది. అందుకే ఇందులో వైసీపీ కాపు నేతలు కనిపించడం లేదు. కాకపోతే పవన్‌ ఒంటరిగా బరిలో గెలవడం కష్టం..అందుకే టీడీపీతో పొత్తు సెట్ అయ్యేలా చేసి..టీడీపీతో కలిసి అధికారం పంచుకునేలా కాపు నేతలు రాజకీయం సెట్ చేస్తున్నట్లు  తెలిసింది.

అయితే వైసీపీ కాపు నేతలు ఏమో జగన్‌ని మళ్ళీ గెలిపించడానికి పనిచేస్తున్నారు. కానీ ఇటు టీడీపీ-జనసేనల్లో ఉన్న కాపు నేతలు..రెండు పార్టీల పొత్తు ఫిక్స్ అయ్యేలా ముందుకెళుతున్నారు. పొత్తు ఉంటే మాత్రం వైసీపీకి చెక్ పెట్టడం సులువు అని అందరికీ అర్ధమవుతుంది. పైగా వైసీపీ వాళ్ళు పవన్‌ని ఏ విధంగా టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. దీంతో కొంత కాపు వర్గం వైసీపీపై ఆగ్రహంతో ఉంది.

ఇదే సమయంలో వైసీపీని గద్దె దించడం పవన్‌కు సాధ్యం కాదు..టీడీపీతో పొత్తు ఉండాలి. అది సెట్ చేయడానికే మధ్యలో కాపు నేతలు ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏపీలో కాపు ఓట్లు టీడీపీ-జనసేనలకు పడేలా స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పవన్‌ని అధికారంలోకి తీసుకురావడానికి కాపు నేతలు పనిచేస్తున్నారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news