నందమూరి బాలకృష్ణ మరియు తెలుగుదేశం పార్టీకి కాపునాడు అల్టిమేటం జారీ చేసింది. స్వర్గీయ ఎస్వీ రంగారావు గారిని ఉధ్ధేశించి నందమూరి బాలకృష్ణ “ఆ రంగా రావు ఈ రంగా రావు” అన్న మాటలని కాపు సామాజిక వర్గం కాపునాడు తీవ్రాతితీవ్రంగా పరిగణించింది. గతంలో కూడా రాజకీయాలలో చిరంజీవి విఫలమయ్యారనీ, రాజకీయాలలో విజయం తమకే సాధ్యమనీ “మా బ్లడ్డు వేరు మా బ్రీడు వేరు” అన్న మాటలు కూడా కాపుల మనోభావాలని తీవ్రంగా దెబ్బతీశాయి.
జనసేన పార్టీ లో తిరిగే వారందరూ అలగాజనం అనీ సంకరజాతి జనం అని అన్నమాటలు కాపుల గుండెల్లో గునపాలు దింపాయి. పై వ్యాఖ్యలపై నందమూరి బాలకృష్ణ 25వ తేది సాయంత్రం లోపు మీడియా ముఖంగా క్షమాపణ చెప్పని.. ఎడల రాష్ట్రంలో ఉన్న స్వర్గీయ వంగవీటి రంగారావు గారి విగ్రహాల వద్ద కాపు సోదరులందరూ ప్లాకార్డులు ప్రదర్శించి మౌన నిరసన తెలపాలని విన్నపం.
గతంలో దేవీబ్రాహ్మణులకి సంతకం లేని లేఖ విడుదల చేసినట్టు కాకుండా స్వయంగా ప్రెస్మీట్ పెట్టి సదరు వ్యాఖ్యలకి మన్నించాలని క్షమాపణ కోరుతూ ఇకపై అటువంటి వ్యాఖ్యలు చేయనని హామీ ఇవ్వని ఎడల యావత్ తెలుగు రాష్ట్రాలలో కీ.శే. వంగవీటి మోహన రంగా గారి విగ్రహాల వద్ధ నిరసన కార్యాచరణ చేపట్టవలసినదిగా విన్నపం. పై విధంగా నందమూరి బాలకృష్ణ క్షమాపణ చెప్పని ఎడల తెలుగుదేశం పార్టీ నుండి నందమూరి బాలకృష్ణని పది సంవత్సరాల పాటు బహిష్కరించవలసినదిగా డిమాండ్ చేయటమైనది. ఈ షరతుకి తెలుగుదేశం తలొగ్గని పరిస్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ పాద యాత్రని కాపు సామాజిక వర్గం అడ్డుకుంటారని హెచ్చరించటమైనది” అని ఆ అల్టిమేట్ లో పేర్కొంది కాపునాడు.