KGF2పై కరణ్ జోహార్ షాకింగ్ కామెంట్స్..

-

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్..ఓ వైపు దర్శకుడిగా కొనసాగుతూనే మరో వైపున పలు చిత్రాలను ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాగా, ఈయన తాజా ఇంటర్వ్యూలో సూపర్ హిట్ మూవీ KGF2పైన షాకింగ్ కామెంట్స్ చేశారు.

KGF2 పిక్చర్ ను బాలీవుడ్ లో తీసి ఉంటే కనుక అది డెఫినెట్ గా డిజాస్టర్ గా మిగిలేదని కరణ్ జోహార్ తన అభిప్రాయం చెప్పారు. ఆ చిత్రం విడుదలైన సందర్భంగా వచ్చిన రివ్యూస్ అన్నిటినీ తాను చదివానని చెప్పుకొచ్చిన కరణ్..బాలీవుడ్ లో రెండు రకాల అస్తిత్వాలున్నాయని తెలిపారు.

బాలీవుడ్ లో కొత్తగా సినిమాలు ప్రయత్నించే అవకాశాలు, వీలు లేకుండా పోయాయని అందుకే ఇక్కడ గొప్ప చిత్రాలు రావని స్పష్టం చేశారు.

RRR, KGF2 వంటి చిత్రాలు ఘన విజయం సాధించడానికి కారణం ఆ చిత్రాల దర్శకులకు ఉన్న గొప్ప విజన్ అని విశ్లేషించారు. అయితే, ఆ విజన్ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ మేకర్స్, ఫిల్మ్స్ లో లోపించిందని అన్నారు. కరణ్ జోహార్ సంస్థ ప్రొడ్యూస్ చేసిన ‘జగ్ జగ్ జీయో’ ఫిల్మ్ ఈ నెల 24న విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news