సిద్ధరామయ్య, డీకేతోపాటు మంత్రులుగా 8 మంది ఎమ్మెల్యేల ప్రమాణం

-

కర్ణాటకలో ఎట్టకేలకు కొత్త సర్కార్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎంగా సిద్ధరామయ్య ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ప్రమాణం చేయనున్నారు. వీరితో పాటు 8 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిసింది.

ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే కొత్త మంత్రివర్గంలో దళిత నేత, పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ జీ. పరమేశ్వర, కేపీ ముణియప్ప, కేజే జార్జ్‌, ఎంబీ పాటిల్‌, సతీశ్‌ కార్జిహోళి, ప్రియాంక్‌ ఖర్గే, రామలింగారెడ్డి, బీజెడ్‌ జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌ కు స్థానం కల్పిస్తారని, వారే నేడు గవర్నర్‌ సమక్షంలో మంత్రులుగా ప్రమాణం చేస్తారని పార్టీవర్గాలు భావిస్తున్నాయి.

సిద్ధరామయ్య, శివకుమార్‌తోపాటు మరో ఎనిమిది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే వెల్లడించారు. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరుగనున్న ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులంతా హజరవుతారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version