కర్ణాటక ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అధికారం ఆ పార్టీదే ?

-

ఈ రోజు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయ్యాయి. మరి రెండు రోజుల్లో పార్టీ భవితవ్యం బయటపడనుంది. ఇక ఎన్నికల అనంతరం ఎప్పటిలాగే ఎగ్జిట్ పోల్స్ లో గెలిచేది ఈ పార్టీనే అంటూ గందరగోళం చేస్తున్నాయి. అయితే వాస్తవంగా ఏ పార్టీ గెలవనుంది అన్నది మాత్రం ఏ సర్వేలు చెప్పకపోయినా గెలిచే సీట్లు ఇవే అంటూ రెండు సర్వేలు మాత్రమే ఊదరగొడుతున్నాయి.

మొదటగా… CGS సర్వే ఈ ఎన్నికలో ఏ పార్టీ ఎన్ని సీట్లు దక్కించుకుంటుందన్నది అంచనాలు వేశాయి. ఆ ప్రకారం అధికార పార్టీ బీజేపీ – 114 సీట్లు, కాంగ్రెస్ – 86 సీట్లు, జేడీఎస్ – 21 మరియు ఇతరులకు మూడు సీట్లు దక్కనున్నాయని తేల్చి చెప్పింది.

ఇక మరో సర్వే జన్ కీ బాత్ సర్వే ప్రకారం బీజేపీ కి 94 సీట్ల నుండి 117 సీట్లు రావచ్చని తెలిపింది. కాంగ్రెస్ సీట్లు 91 నుండి 106 సీట్లు , జేడీఎస్ కు 14 నుండి 24 సీట్లు మరియు ఇతరులకు 2 వరకు సీట్లు దక్కనున్నాయని సర్వే తెలిపింది. మరి ఏ సర్వే నిజం అవుతుందో ? అధికారంలోకి వచ్చే పార్టీ ఏదో తెలియాలంటే మే 12 వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version