కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో బోనులో నిలబడ్డ మోనితను లాయర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. మీ కడుపులో బిడ్డకు తండ్రి అని లాయర్ అడిగితే కార్తీక్ అంటుంది. అబద్ధం నాకు సంబంధం లేదని కార్తీక్ అంటాడు. లాయర్ పెళ్లి కాకుండా తండ్రి ఎలా అయ్యారో అడిగితే ఆర్టీఫీషియల్ ఇన్సేమ్యూనేషన్ చేయించుకున్నాను చెప్తుంది. కార్తీక్..నా ప్రేమేయంతో మోనిత గర్భందాల్చితే నేను నైతికబాధ్యత వహిస్తా కానీ మోనిత అలా చేయలేదు.. నాకు సంబంధలేదు అంటాడు. లాయర్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు, మీకు పిల్లలంటే ఇష్టమా అని అడుగుతాడు. కార్తీక్ తో పిల్లలు అంటే ఇష్టం అంటుంది మోనిత. ఆ మాటకు కోర్టులో ఉన్నవారంతా నవ్వుతారు. ఈ విషయం కార్తీక్ తో ఎందుకు చెప్పలేదు అని లాయర్ అడుగుతాడు. ఎలాగో పెళ్లవుతుందికదా పెళ్లిచేసుకుని ఫస్ట్ నైట్ లో చెప్దాం అనుకున్నాను మోనిత అంటుంది.
కార్తీక్ నాకు మోనిత మధ్య పవిత్రమైన స్నేహం మాత్రమే ఉంది. నేను ఒకసారి మోనితను పెళ్లిచేసుకుంటా అన్నాను అదికూడా మా అమ్మను బెదిరించాలనే తప్ప వేరే ఏ ఉద్దేశం లేదు అని తన గర్బం ఎలా తెచ్చుకుందో మళ్లీ చెప్తాడు. అజ్ఞాతంలోకి వెళ్లి మోనిత చేసిన బెదిరింపులను చెప్తాడు. ఇది జరిగింది, మీరే ఆలోచించండి యువరానర్..ఆమెది ఒన్ సైడ్ లవ్ ఉన్మాదంలోకి వెళ్లి నా జీవితంలోకి చొచ్చుకురావాలని చూస్తుంది. నేను మళ్లీ మళ్లీ చెప్పాలనుకుంటుంది ఒక్కటే మోనిత కడుపులో పెరిగే బిడ్డకు నేను తండ్రిని కాదు అని గట్టిగా చెప్తాడు.
జడ్డీ తీర్పు ఇచ్చే ముందు మోనితను మళ్లీ అడుగుతాడు కోర్టుకు చెప్పుకోవాల్సింది ఏమైన ఉందా అని. మోనిత తన చిన్నతనం గురించి మోదలేస్తుంది. కార్తీక్ పరిచయం నాలో కోటి ఆశలు రేపాయ్ అంటూ తన ప్రేమ చెప్తుంది. ఏడ్చుకుంటూ సెంటిమెంట్ కురిపిస్తుంది. ఈ సీన్ లో ప్రేక్షకులు కూడా మోనిత వైపే వెళ్లిపోతారేమే..అలా సెంటిమెంట్ పండిస్తుంది మోనిత. ఫైనల్ గా నేను చెప్పాలనుకున్నది ఒక్కటే…ఆయన కట్టుకున్న భార్య కడుపుతో ఉన్నప్పుడు నేను తండ్రిని కాదన్నాడు. పదకొండేళ్లతర్వాత ఇప్పుడు కలిశారు. అలాగే నన్ను ఇప్పుడు కాదన్న కొన్నిరోజులకు ఆదరిస్తాడేమో..ఎవరు కాదన్నా నా కడుపులో పెరిగే బిడ్డకు తండ్రి కార్తీక్ అని ఖారకండీగా చెప్తుంది.
జడ్డీ..వాదోపవాదల అనంతరం కూడా మోనితలో పాశ్చత్తాపం అనేదే లేదని గమనించిన మీదట..మోనితను నేరస్తురాలుగా పరిగణించటమైంది. కార్తీక్ ను జైల్లో పంపించినందుకు పరువునష్టం కింద 5లక్షల జరిమాన, తప్పుడు సాక్ష్యాలు సృష్టించినందుకు 18 నెలలు కఠినకారాగార శిక్ష విధిస్తూ..హిమను హత్యచేసిందనే నేరారోపణ విషయంలో విచారణ కొనసాగించాలని పోలీస్ వారికి ఆదేశిస్తూ.. తీర్పు ముగించటమైంది అంటాడు.
మోనితను పోలీసులు తీసుకెళ్తారు. బయట మీడియా ఉంటుంది. రకరకాల ప్రశ్నలు అడుగుతారు. బిడ్డను జైల్లోనే కంటారా, మీరు చేసిన తప్పుకు మీ బిడ్డకు జైలుశిక్ష పడింది, ఇంత చేసి జైలుశిక్ష పడ్డాకూడా మీ ముఖంలో కాస్తకూడా విచారణ కనిపించటంలేదేంటి అని అడుగుతారు. ఇది ఇంటర్ వెల్ మాత్రమే క్లైమాక్స్ మీరు ఎవరూ ఊహించలేరు అని దీప దగ్గరకు వెళ్లబోతుంది. రోషిణి ఇప్పటికే చాలా మాట్లాడావ్.. చాలు బండెక్కు అని నెడుతుంది. మోనిత అక్కడినుంచే దీపక్క నేను నీకు చెల్లన్ని అవుతున్నాను, సౌందర్య ఆంటీ..నా బిడ్డకు బారసాల, అక్షారాభ్యాసం, అన్నంప్రసన అన్నీ మీ చేతులమీదుగానే జరగాలి.. లేకపోతే నేను ఊరుకోను, ఆనంద్ రావు అంకుల్ నాకు కొడుకే పుడతాడు వాడికి మీ పేరే పెడతాను. బిడ్డతో వస్తాను గుర్తుపెట్టుకోండి అంటుంది. ఈ మాటలు వింటున్న దీప, సౌందర్య వాళ్లకు వెళ్లి మోనితను కొట్టాలన్నంత కోపం వస్తుంది. కానీ అనవసరంగా దాన్ని కొట్టి మీడియాలో వైరల్ గా మారటం ఎందుకని దీపను సౌందర్య ఆపుతుంది. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.