అయోధ్య ‘రామ మందిరం’ నేపథ్యంలో కార్తికేయ-3 !

-

Karthikeya 2 : నిఖిల్‌ హీరోగా తెరకెక్కిన సరికొత్త చిత్రం ‘కార్తికేయ – 2’. చందు మొండేటి దర్శకుడు. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌, అనుపమ్‌ ఖేర్‌, శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష తదితరులు నటించారు. చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పడు ఓటీటీలోనూ సందడి చేస్తోంది కార్తికేయ 2.

ప్రత్యేకంగా బాలీవుడ్ లో ఈ సినిమాతో నిఖిల్ కి మార్కెట్ కూడా క్రియేట్ అయ్యింది. అందుకే కార్తికేయ-3 సినిమాపై అందరిలోనూ ఆసక్తి రెట్టింపు అయింది. అయితే ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ కార్తికేయ-3 సినిమాపై నిఖిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నేను ఎక్కడికి వెళ్ళినా ఆడియన్స్ కార్తికేయ-3 గురించి అడుగుతున్నారు. నేను కార్తికేయ-3 చేయకపోతే నన్ను ఎవ్వరూ వదిలేలా లేరు. కార్తికేయ-3 సినిమా అది త్వరలోనే ప్రారంభం కానుందని నిఖిల్ చెప్పుకొచ్చాడు. అయితే, ఈసారి కార్తికేయ-3 అయోధ్య ‘రామ మందిరం’ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version