ఏపీ హైకోర్టులో కసిరెడ్డి రాజశేఖరరెడ్డికి చుక్కెదురు అయింది. మద్యం కేసులో సీఐడీ నోటీసులను హైకోర్టులో సవాల్ చేస్తూ కసిరెడ్డి పిటిషన్ వేశారు. అయితే కసిరెడ్డి పిటిషన్ ను డిస్మిస్ చేసింది హైకోర్టు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రదారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ కేసులో వెంటనే విచారణకు హాజరు కావాలని ఇటీవలే కసిరెడ్డికి సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.
ఈ తరుణంలోనే తనకు సీఐడీ నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ.. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ ఆయన పిటిషన్ పై విచారణ చేపట్టి ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసులపై తాము ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది. తదుపరి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే ముందు పిటిషనర్ కు కాస్త సమయం ఇవ్వాలని దర్యాప్తు సంస్థ అధికారులను హైకోర్టు ఆదేశించింది.