రాహుల్ గాంధీ పెళ్లికి వెళ్తే తప్పా… గతంలో మోదీ పాకిస్థాన్ వెళ్లలేదా..?: రణ్ దీప్ సుర్జేవాలా

-

రాహుల్ గాంధీ పెళ్లికి వెళ్తే తప్పేంటని ప్రశ్నించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. రాహుల్ గాంధీ నేపాల్ ఖాట్మాండులో ఓ నైట్ క్లబ్ లో కనిపించడం…  ఆ వీడియో వైరల్ కావడంతో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. దీనిపై కాంగ్రెస్ కౌంటర్ ఎటాక్ చేస్తోంది. రాహుల్ గాంధీ తన స్నేహితుడు, జర్నలిస్ట్ సుమ్నియా ఉదాస్ పెళ్లికి హాజరయ్యారని… స్నేహితుడి పెళ్లి కోసం మిత్రదేశం వెళ్తే తప్పేంటని బీజేపీని ప్రశ్నించారు. కుటుంబం, స్నేహితులు & వివాహ వేడుకలకు హాజరు కావడం మన సంస్కృతి మరియు నాగరికతకు సంబంధించిన విషయం అని ఆయన అన్నారు. ఈదేశంలో ఇప్పటి వరకు పెళ్లిళ్లకు వెళ్లడం నేరం కాదు.. కానీ ఈ రోజు బీజేపీ దీన్ని చట్ట వ్యతిరేఖ చర్యగా పరిగణిస్తుందేమో అని ఎద్దేవా చేశారు రణ్ దీప్ సుర్జేవాలా. 2015లో అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కోసం మోదీ పాకిస్తాన్ వెళ్లలేదా అని ప్రశ్నించారు. మోదీ పాకిస్తాన్ వెళ్లి వచ్చాకే పఠాన్ కోట్ ఉగ్రదాడి జరిగిందని ఆయన ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version