BREAKING : భూముల విలువలు పెంచుతూ కేసీఆర్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..వారికి చార్జీల నుంచి మినహాయింపు

-

వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి అమల్లోకి పెరిగిన మార్కెట్ విలువలు అమలులోకి రానున్నాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ రుసుము కట్టిన వారికి కొత్త చార్జీల నుంచి మినహాయింపు ఉండనుంది. పాత విలువలతోనే రిజిస్ట్రేషన్ల పక్రియ కొనసాగింపుకు వెసులుబాటు ఉండనుంది. ఈరోజు నుంచి 141 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కొత్త మార్కెట్ విలువలు అందుబాటులోకి రానుండగా.. నేటి నుంచి కొత్త మార్కెట్ విలువల ప్రకారం రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి.

ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. 50 శాతం పెరిగినా వ్యవసాయ భూముల మార్కెట్ విలువ.. ఖాళీ స్థలాల విలువ 35 శాతం, ప్లాట్ల విలువ 25 శాతం పెరిగింది.. పెరిగిన విలువకు 7.5 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు వసూలు చేయనుండగా.. డిమాండ్ అధికంగా ఉన్న ప్రాంతాలలో విలువ పెంపుదల ఉండనుంది. పెరిగిన విలువ ప్రకారం సబ్ రిజిస్టర్ సాఫ్ట్వేర్లో మార్పులు చేసింది రిజిస్ట్రేషన్ శాఖ. దీంతో తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి లక్ష దాటింది ఖాళీ స్థలం చదరపు గజం ధర. ప్లాట్ చదరపు అడుగు విలువ 9 వేలు దాటింది. నిన్న అర్ధరాత్రి వరకు జరిగిన రిజిస్ట్రేషన్స్… ఈ రిజిస్ట్రేషన్ ద్వారా జనవరి లోనే ప్రభుత్వానికి 1200 కోట్ల ఆదాయం వచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version