తెలంగాణ రాష్ట్రంలోని అనాధ పిల్లలకు కేసీఆర్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. భారత దేశం గర్వించేలా అనాథల కోసం సమగ్ర చట్టం తీసుకు వచ్చేందుకు నిర్ణయం తీసుకుంది కెసిఆర్ సర్కార్. సమగ్ర చట్టం ప్రకారం ఇక తెలంగాణలో అనాథలు.. రాష్ట్ర బిడ్డలుగా పరిగణించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అనాథలందరికీ కెసిఆర్ ప్రభుత్వమే తల్లిదండ్రిగా అన్ని బాధ్యతలు తీసుకోనుంది.
అనాథలను అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసేవారిపై పిడి యాక్టు కూడా అమలు చేసేందుకు కెసిఆర్ సర్కార్ సన్నద్దం అవుతోంది. సిగ్నళ్ల వద్ద అనాథలతో బిక్షాటన చేసే వారిని కట్టడి చేసేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది. కోవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలకు అండగా సర్కారు ఉండనుంది. అలాగే అనాథలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నాణ్యమైన విద్య అందించనుంది.
ప్రత్యేక గురుకులాలతో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. జీవితంలో ఉపాధి కల్పించి, కుటుంబం ఏర్పడే వరకు ప్రభుత్వ సంరక్షణ ఏర్పరచనుంది. రాష్ట్ర బిడ్డలుగా గుర్తిస్తూ ప్రత్యేక స్మార్ట్ కార్డు కూడా ఇవ్వనుంది. ఈ మేరకు నేడు సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో.. మంత్రులు ఈ నిర్ణయాలపై చర్చించనున్నారు. ఇక సమగ్ర చట్టం పై సిఎం కెసిఆర్ కూడా సంతకం చేయనున్నారు.