దళితులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త చెప్పారు. టీ ప్రైడ్ పథకం కింద దళిత ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. పరిశ్రమల ఏర్పాటుకు టీఎస్‌ఐఐసీ కేటాయిస్తున్న భూమి విలువపై 50 శాతం రాయితీ ఇస్తుండగా… మిగిలిన 50 శాతానికి చెల్లించే వడ్డీని 16 శాతం నుంచి 4 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది సర్కార్.
ఈ మొత్తాన్ని వాయిదాల పద్దతిలో చెల్లించే వెసులు బాటును కల్పిస్తున్నట్లు ఐటీ మంత్రి కేటీఆర్ ప్రకటన చేశారు. సమాజంలో అట్టడుగున ఉన్న దళిత వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉందన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం హైదరాబాద్ లో ఏర్పాటు కాబోతుందని కేటీఆర్ ప్రకటన చేశారు. ప్రజా స్వామ్య పరి రక్షణ కోసం పాటు పడే వారికి అంబెడ్కర్ ఆదర్శమని.. ఎనిమిది నెలల గా అంబేద్కర్ విగ్రహ పనులు ముమ్మరము గా సాగుతున్నాయన్నారు. 55 అడుగులు బేస్, 125 అడుగులు విగ్రహం రెడి అవుతుందని… ఈ ఏడాది డిసెంబర్ కి విగ్రహం పనులు పూర్తి అవుతుందన్నారు.