ఎం కెసిఆర్.. ఉద్యోగులతో ఇంకెన్ని రోజులు ఈ ఆటలు?: విజయశాంతి

-

టిఆర్ఎస్ ప్రభుత్వం పై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బిజెపి నేత విజయశాంతి. తెలంగాణ ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ పండగపూట కూడా పైసలు ఇచ్చేలా లేదని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారు.

” తెలంగాణ ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ పండగపూట కూడా పైసలిచ్చేలా లేదు. అక్టోబర్ 3న బతుకమ్మ, 5న దసరా పండుగలున్నయి. కానీ, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు జీతాల టెన్షన్ పట్టుకుంది. సరైన సమయానికి వేతనాలు వస్తాయా? లేవా? అనే ఆందోళనలో ఉద్యోగులున్నరు. ఈ విషయంపైనే ఆర్థికశాఖ మల్లగుల్లాలు పడుతోంది. గతేడాది కూడా పండుగ తర్వాతే జీతం జమ అయ్యింది. ప్రతి నెలా జీతాలు ఆలస్యమవుతునే ఉన్నయి. అక్టోబర్ మొదటివారంలోనే బతుకమ్మ, దసరా పండుగలు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది.

ప్రతి నెలా ప్రభుత్వం ఆలస్యంగా వేతనాలు జమ చేస్తుండటంతో.. అక్టోబర్‌లోనూ అలాగే లేట్ అయితే… పండుగలకు పైసలెట్ల? అనే ఆందోళన మొదలైంది. కనీసం వచ్చే నెలలో అయినా ఒకటో తేదీకి జీతాలొస్తే పండుగ షాపింగ్ చేయొచ్చనే ఆలోచనలో ఉన్నరు. కానీ వేతనాలను ప్రభుత్వం ముందుగానే జమ చేస్తుందా? లేదా ఎప్పటిలాగే ఆలస్యంగా అందిస్తుందా? అనేది సస్పెన్స్‌గా మారింది. ఏం కేసీఆర్… ఉద్యోగులతో ఇంకెన్ని రోజులు ఈ ఆటలు? త్వరలో సర్కారీ ఉద్యోగులే… కేసీఆర్ సర్కార్‌ను పడగొట్టడం ఖాయం”. అని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version