కెసిఆర్ భయంలో ఉన్నారు – తమ్మినేని వీరభద్రం

-

కెసిఆర్ భయం లో ఉన్నారని, మహారాష్ట్ర పరిణామాల తర్వాత కేసిఆర్ కు నిద్ర పడుతుందో లేదో అని అన్నారు తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.తెలంగాణాలో రాజకీయ వేడి ఎక్కువగా ఉందన్నారు. ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం కూడా జరుగుతోందన్నారు తమ్మినేని.ప్రజా సమస్యలు గురించి ఏ పార్టీ మాట్లాడకుండా అన్ని పార్టీలు రాజకీయాలు మాట్లాడుతున్నాయన్నారు.8 ఏళ్ళలో ఏ ఒక్క ప్రధాన డిమాండ్ కూడా నెరవేరలేదన్నారు.కేసీఆర్ సంక్షేమ పథకాలు గట్టెక్కించే పరిస్థితి లేదన్నారు తమ్మినేని.

బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రభావం తగ్గించడంలో కేసీఆర్ విజయం సాధించారన్నారు.కేసీఆర్ బిజెపిని వ్యతిరేకిస్తూ మంచి పని చేస్తున్నారని అన్నారు.బిజెపికి వ్యతిరేకంగా కేసీఆర్ మాట్లాడుతున్నారు కాబట్టి సిపిఎం, టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోదన్నారు.కేసీఆర్ ప్రజాస్వామ్యయుతంగా ధర్నాలు,సభలు పెట్టుకునే స్వేచ్ఛ కూడా ఇవ్వట్లేదని మండిపడ్డారు. మహారాష్ట్ర పరిణామాల తరువాత కేసిఆర్ కు నిద్ర పడుతుందో లేదో నని అన్నారు. చాలా మంది షిండే లు ఉన్నారని బిజెపి ప్రచారం చేస్తోందని అందుకే కేసిఆర్ భయములో ఉన్నాడని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news