నేడు చేవెళ్ల KCR బహిరంగ సభ… ఇక సమరమే

-

గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు పార్లమెంట్ ఎన్నికల సంబరానికి సిద్ధమయ్యారు. ఇవాల్టి నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఇందులో భాగంగానే ఇవాల్టి నుంచి బహిరంగ సభలలో జనాల మధ్యలో కనిపించనున్నారు. ముఖ్యంగా ఇవాళ చేవెళ్ల నియోజకవర్గం నుంచి తన ప్రచారాన్ని ప్రారంభిస్తారు కేసీఆర్.

ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు చేవెళ్ల నియోజకవర్గం లో కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఉండనుండి. ఈ సభకు దాదాపు రెండు లక్షలకు పైగా జనాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చేవెళ్లలోని పరా ఇంజనీరింగ్ కళాశాలలో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు గులాబీ కార్యకర్తలు అలాగే లీడర్లు. ఈ సభ సక్సెస్ చేసేందుకు సబితా ఇంద్ర రెడ్డి కుటుంబం చాలా కష్టపడుతోంది. ఇక ఇవాళ బహిరంగ సభలో కేసీఆర్ ఘాటుగా ప్రసంగించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version