ఇందిరమ్మ రాజ్యం మంచిగుంటే.. ఎన్టీఆర్ పార్టీ ఎందుకు పెట్టాడు : కేసీఆర్

-

మానకొండూర్ లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. ఇందిరమ్మ పాలన బాగుంటే వలసలు ఎందుకు జరిగాయి. ఇందిరమ్మ పాలన బాగుంటే ఎన్టీఆర్ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది ? ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ పెట్టి జైల్లో వేసి కొట్టడమా ? కాంగ్రెస్ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ ఇవ్వాలని 33 పార్టీల మద్దతు రావడం.. కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని దీక్ష చేస్తే తెలంగాణ వచ్చినట్టు ప్రకటన చేశారు. కానీ అప్పుడు మళ్లీ ప్రకటన వెనక్కి తీసుకున్నారు. కాంగ్రెస్ ఓటు వేయాలంటే వాస్తవాలను తెలుసుకొని ఓటు వేయాలి. కాంగ్రెస్ పాలనలో పత్తి కాయలు పగిలినట్టు రైతులు గుండెలు పగిలినయి.


కాంగ్రెస్ ప్రభుత్వంలో పెన్షన్ రూ.200 మాత్రమే ఇచ్చేది. తాము అధికారంలోకి వచ్చిన తరువాత దానిని రూ.1000 పెంచాం. దానిని తిరిగి మళ్లీ డబుల్ చేశాం.. ఇలా అంచెలంచెలుగా పెంచుకుంటూ పోతున్నామని తెలిపారు కేసీఆర్. మానకొండూర్ నుంచి జీవండికి వలసలు వెళ్లే వారు. తెలంగాణ కోసం వందలాది మంది తెలంగాణ బిడ్డలను కాంగ్రెస్ బలితీసుకుందన్నారు. రసమయి బాలకిషన్ ని గెలిపిస్తే పెన్షన్ రూ.5వేలకు తీసుకెళ్తామని వెల్లడించారు కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version