యాదాద్రిపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్..కొత్త బస్‌స్టేషన్ ఏర్పాటు

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పునఃనిర్మించిన యాదాద్రి ఆలయంలో మరింత భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ప్రదేశాల నుంచి యాదాద్రికి ఆర్టీసీ అధికారులు బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు.

భక్తుల రద్దీ కారణంగా యాదాద్రిలో సరికొత్త బస్‌ స్టేషన్‌ కూడా నిర్మిస్తోంది. ఈ కొత్త బస్‌ స్టేషన్‌ ను గతంలో శంకుస్థాపన చేయగా, ఇప్పుడు పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఫిబ్రవరి 1వ తేదీన యాదాద్రి కొత్త బస్‌ స్టేషన్‌ ను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ కొత్త బస్‌ స్టేషన్‌ కోసం.. తెలంగాణ ప్రభుత్వం.. రూ.6 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ మేరకు తాజాగా నిధులను కూడా రిలీజ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news