ఆ సినిమాపైనే కీర్తి సురేశ్ ఆశ‌లు.. హిట్ అయితే స్టార్ డ‌మ్ ఖాయం

-

కీర్తి సురేశ్ అనే బ‌దులు మ‌హాన‌టి అంటే బాగుంటుందేమో. మ‌రి ఆ సినిమాతో అంత‌గా పేరు తెచ్చుకుంది ఈ బ్యూటీ. సినీ నేప‌థ్యం ఉన్న ఇంటి నుంచి వ‌చ్చిన ఈ పిల్ల వ‌రుస‌గా టాలీవుడ్‌, కోలీవుడ్‌లో స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ క్రేజ్‌ను మాత్రం అందుకోలేక‌పోయింది.

 

త‌న‌కంటే వెన‌క వ‌చ్చిన హీరోయిన్లు కూడా స్టార్ హీరోయిన్ రేసులో దూసుకుపోతున్నారు. కానీ కీర్తి మాత్రం ఇప్ప‌టికీ ఆవ‌రేజ్ హీరోల‌తోనే సినిమాలు చేస్తోంది. అయితే అంద‌రిలాగే తానుకూడా గ్లామ‌ర్ డోస్‌ను పెంచితేనే బాగుంటుంద‌ని ఆలోచిస్తోంది.

ఇందుకోసం ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో పొట్టి డ్రెస్సుల్లో ఫొటోషూట్‌లు చేస్తూ ర‌చ్చ చేస్తోంది. ఇక మ‌హేశ్‌బాబు స‌ర్కారువారి పాట సినిమాలో న‌టిస్తోంది. ఈ సినిమాతో ఎలాగైనా స్టార్ హీరోయిన్ రేంజ్ వ‌స్తుంద‌ని ఆశ ప‌డుతోంది. ఇదే గ‌న‌క హిట్ అయితే కీర్తికి తిరుగుండ‌ద‌నే చెప్పాలి. మ‌రి ఈ సినిమా ఆమె క‌ల‌ను నిజం చేస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version