మా దగ్గర 100 మంది సిసోడియాలు ఉన్నారు..ఏం పీకలేరు – కేజ్రీవాల్‌

-

మా దగ్గర 100 మంది సిసోడియాలు ఉన్నారు..ఏం పీకలేరని బీజేపీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ వార్నింగ్‌ ఇచ్చారు. 12 ఏళ్ల క్రితం అవినీతికి వ్యతిరేకంగా రాంలీలా మైదాన్‌లో సమావేశమయ్యామని.. ఇప్పుడు నియంతృత్వానికి వ్యతిరేకంగా సభ జరుపుకుంటున్నామని వెల్లడించారు. ఇప్పుడు మొదలయ్యేది రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఉద్యమం… ఈ ఉద్యమం కూడా విజయం సాధిస్తుంది.

సభకు వచ్చిన ప్రతి ఒక్కరు మీ మొబైల్ ఫోన్లు తీసి ఫేస్‌బుక్ లైవ్ పెట్టండని పేర్కొన్నారు అరవింద్ కేజ్రీవాల్. సుప్రీంకోర్టులో ఢిల్లీ ప్రజల తరఫున జరిగిన 8 ఏళ్ల పోరాటం ఫలించిందని.. మే 11న రాజ్యాంగ ధర్మాసనం అధికారుల బదిలీలపై కీలక తీర్పునిచ్చిందని వివరించారు. మే 19న సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీ ఆర్డినెన్స్ తీసుకొచ్చారని.. తద్వారా సుప్రీంకోర్టు ఆదేశాలను తాను పాటించబోనని చెబుతున్నారని ఆగ్రహించారు. ఇది హిట్లర్ తరహా నియంతృత్వం కాక మరేంటి? ప్రజాస్వామ్యానికి ముగింపు కాక మరేంటి? అని నిలదీశారు. మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్‌లను జైల్లో పెట్టారని… మా దగ్గర 100 మంది సిసోడియాలు, 100 మంది సత్యేందర్ జైన్లు ఉన్నారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version