ఇస్లాం మతంలో హిజాబ్ తప్పని సరి కాదు… ఆ రాష్ట్ర గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

-

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హిజాబ్ రచ్చ నడుస్తోంది. కర్ణాటకలో మొదలైన ఈ వివాదం దేశ రాజకీయాలను కూడా కుదిపేస్తోంది. ఓ వర్గం విద్యార్థులు హిజాబ్ ధరిస్తూ కళాశాలకు, స్కూళ్లకు వస్తుండటాన్ని మరో వర్గం విద్యార్థులు వ్యతిరేఖిస్తూ.. కాషాయ కండువాలతో రావడం తీవ్ర ఉద్రిక్తలకు తావిచ్చింది. ప్రస్తుతం ఈ వివాదం కర్ణాటక హైకోర్ట్ పరిధిలో ఉంది. ఎలాంటి మతపరమైన వేషధారణతో రావద్దంటూ.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

ఇదిలా ఉంటే ఈ వివాదంపై రాజకీయ నాయకులు పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు హిజాబ్ కు మద్దతు ఇస్తుంటే.. బీజేపీ మాత్రం పాఠశాలల్లో అంతా సమానంగా ఉండాలని డ్రెస్ కోడ్ తప్పనిసరి అంటూ వ్యాఖ్యలు చేస్తోంది.

 

తాజాగా కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖురాన్ లో హిజాబ్ గురించి ఏడు సార్లు ప్రస్తావన ఉందని తెలిపారు. అయితే ఇది మహిళల డ్రెస్ కోడ్ తో సంబంధం లేదని తెలిపారు. ఇది ముస్లిం బాలికల అభివ్రుద్ధిని ఆపే కుట్ర అని ఆయన వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు తరగతి గదులకు వెళ్లి చదువు కొనసాగించాలని సూచించారు. సిక్కు మతంలో తలపాగా మాత్రం ముఖ్యమైన భాగమని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news