లెస్బియన్ జంటను కలిపిన కేరళ హైకోర్ట్

-

కేరళ హైకోర్ట్ కీలక తీర్పు చెప్పింది. ఇద్దరు అమ్మాయిలు కలిసి జీవించేందుకు అనుమతి ఇచ్చింది. వివరాల్లోకి వెళితే కేరళకు చెందిన పాతిమా నూరా, ఆదిలా నస్రీన్ ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇదే సమయంలో ఇరు కుటుంబాలు వీరి ప్రేమకు అడ్డు చెప్పాయి. దీంతో పాతిమా నూరాను ఆమె తల్లిదండ్రులు తీసుకెళ్లారు. ఆమెను బలవంతంగా కన్వెర్షన్ సెంటర్లో జాయిన్ చేశారు. ఇదిలా ఉంటే నెచ్చెలి ఎడబాటుపై ఆదిలా నస్రీన్ కేరళ హైకోర్ట్ తలుపు తట్టింది. హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. దీంతో పోలీసులు పాతిమా నూరాను కోర్ట్ లో హాజరు పరిచారు. ఇద్దరూ కలిసి జీవించాలనే కోరికను వ్యక్తం చేయడంతో జస్టిస్ కె. వినోద్ చంద్రన్, సి.జయచంద్రన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వీరిద్దరికి అనుకూలంగా తీర్పు చెప్పింది. ఇది కఠినమైన సమయం అని మమ్మల్ని మానసికంగా హింసించారని ఎల్జీబీటీక్యూ అనే సంస్థ మాకు మద్దతుగా నిలిచిందని ఆదిలా నస్రిన్ వెల్లడించారు. హైకోర్ట్ ఆదేశాలతో మేము సంతోషంగా, స్వేచ్ఛగా ఉన్నామని.. మా కుటుంబాలు ఇప్పటికీ మమ్మల్ని బెదిరిస్తున్నాయని ఆమె అన్నారు. తాము ఇద్దరు స్కూల్ డేస్ నుంచి ప్రేమించుకుంటున్నామని ఆదిలా అన్నారు. ఈ విషయం తమ ఇంట్లో కూడా తెలుసని..అయితే మేం చదువు ముగించుకుని ఉద్యోగాలకు వేరే ఊళ్లకు వెళ్లిన సమయంలో పరిస్థితులు తారుమారయ్యాని ఆదిలా వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news