గత వారం నుండి దేశ వ్యాప్తంగా కేంద్ర కాబినెట్ లో కీలక మార్పులు జరుగుతాయని వార్తలు వస్తూనే ఉన్నాయి. అప్పటి నుండి బీజేపీ హై కమాండ్ రెండు సార్లు మీటింగ్ లలో పాల్గొన్నాయి. అయినప్పటికి బీజేపీ ఈ కెబినెట్ మార్పులపై ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం రానున్న రెండు రోజుల్లో ఈ కెబినెట్ మార్పుల గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందట. అయితే అనూహ్యమైన మార్పులు చేయడానికి పూనుకోవడం వల్లనే ఇంత ఆలస్యం అవుతోందని సమాచారం. ఇంకా హై కమాండ్ నుండి వినిపిస్తున్న ప్రకారం మొత్తం 22 మంది కేంద్ర మంత్రులపై వేస్తూ వేయడానికి మోదీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇక ఇటీవల కిషన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మార్చడం వలన ఆయనను ఎవరితో భర్తీ చేస్తారు ? తెలుగు రాష్ట్రాల నుండి ఎవరిని తీసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది.