కేజీఎఫ్ 3పై కీలక కామెంట్లు చేసిన హీరో యష్

-

కేజీఎఫ్ క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. కన్నడ సినిమాగా వచ్చిన కేజీఎఫ్ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్, తమిళ్, మళయాళంలోనూ సత్తా చాటుతోంది. ఒక్క సినిమాతో ప్రశాంత్ నీల్ సంచన డైరెక్టర్ గా మారిపోయాడు. కేజీఎఫ్ లో హీరో యశ్ మానరిజం నార్త్ పీపుల్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. కేజీఎఫ్1 తో పోలిస్తే కేజీఎఫ్ 2 సంచలనాలు క్రియేట్ చేస్తోంది. కేవలం 12 రోజుల్లోనే రూ. 900 కోట్లను వసూలు చేసింది. ఇప్పటి వరకు దంగల్ పేరుతో ఉన్న రికార్డ్ ను క్రాస్ చేసేందుకు మరెంతో సమయం లేదని క్రిటిక్స్ చెబుతున్నారు. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం అంతా కేజీఎఫ్ 3 గురించి చర్చ జరుగుతోంది. కేజీఎఫ్ 2 హ్యూజ్ సక్సెస్ తరువాత కేజీఎఫ్ 3 తప్పకుండా ఉంటుందని అంతా అనుకుంటున్నారు. దీనిపై హీరో యశ్ కూడా క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూతో కేజీఎఫ్ 3పై కీలక కామెంట్లు చేశాడు. కొన్ని సన్నివేశాలు, ఆలోచనలు కేజీఎఫ్ 2లో అమలు చేయలేకపోయామని వాటిని మూడో భాగంలో తెరకెక్కిస్తాం అని అన్నారు. ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం ఉన్నా… కేజీఎఫ్ 3 పెద్దది, మెరుగ్గా ఉంటుందని యశ్ స్పష్టం చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news