ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి… దేశాన్ని దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. : డీకే అరుణ

-

తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ ఆకాశమంతా ఎత్తు ఎత్తాడు .. చేసింది మాత్రం ఏమి లేదని…ఫ్లీనరీలో అమరవీరుల స్థూపానికి కేసీఆర్ నివాళులు అర్పిస్తుంటే.. అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇప్పుడు జాతీయ రాజకీయాల పేరుతో దేశాన్ని దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కేసీఆర్ పై ధ్వజమెత్తింది. ప్రధాని మోదీ నీకు పోలికా…? ప్రధానిని విమర్శిస్తూ జాతీయ నేత కావాలని చూస్తున్నారంటూ విమర్శించింది. దళిత బంధును తెలంగాణలో అమలు చేయకముందే… దేశం మొత్తం అమలు చేయాలని తీర్మాణం చేస్తారా..? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ఉద్యోగ ప్రకటనలను ఎన్నికల నోటిఫికేషన్లుగా చూస్తున్నారంటూ విమర్శించింది.

లక్షల కోట్లతో ఫామ్ హౌజ్ కు నీళ్లు తీసుకువచ్చుకున్నారని విమర్శించింది. వరిధాన్యం కొనుగోలుకు కేంద్రమే డబ్బులు ఇస్తుందని అన్నారు. దేశ ప్రధానికి అహంకారం ఉంటే కేసీఆర్ ఇన్నిసార్లు మోదీని కలిసే వారా..? అంటూ డీకే అరుణ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అయిపోయింది.. ఇక భారత రాష్ట్రీయ సమితి అంటా.. భారత రాష్ట్రీయ సమితిని కేసీఆర్ కుటుంబం కోరుకుంటుంది తప్పితే ప్రజలెవ్వరు కోరుకోవడం లేదని అన్నారు. ఉద్వేగాల భారత్ కాదు.. ఉద్యోగాల భారత్ కావాలంటున్న కేసీఆర్ మీకంటే ఉద్వేగాలు ఎవరూ రెచ్చగొట్టరని విమర్శించింది. మహిళలు అంటే గౌరవం లేని కేసీఆర్ 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మాణం చేయడం ఆశ్చర్యకరంగా ఉందని ఎద్దేవా చేసింది. పీకేతో కలిసి కాంగ్రెస్, trs ఎన్ని డ్రామాలు ఆడిన ప్రజలు బీజేపీ కే పట్టం కడుతారని స్పష్టం చేశారు డీకే అరుణ

Read more RELATED
Recommended to you

Latest news