ఖైరతబాద్ గణపతి శోభాయాత్ర కాసేపటి క్రితమే ప్రారంభం అయింది. ఖైరతబాద్ గణపతి శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక ఈ నేపథ్యంలోనే ఖైరతబాద్ వినాయక నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. GHMC పరిధిలోని పలు ప్రాంతాలలో పర్యటిస్తూ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చార్మినార్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తుందని… Ghmc పరిధిలో సుమారు 40 వేల విగ్రహాలను ప్రతిష్టించడం జరిగిందన్నారు. వీటిలో కోన్ని 3 వ రోజు, 5 వ రోజు మరికొన్ని విగ్రహాలను నిమజ్జనం చేయడం జరిగిందని… ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శోభాయాత్ర, నిమజ్జనం జరిగేలా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.
ప్రశాంతంగా నిర్వహించేలా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని… దేశంలోనే అతి పెద్ద వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం త్వరగా పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. హైదరాబాద్ లో నిర్వహించే గణేష్ శోభాయాత్ర కు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని… భక్తులు, ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.