ఖైదీల భార్యలపై కన్నేసిన ఖాకీ.. ములాకత్‌కు వచ్చిన వారిపై వేధింపులు

-

స్త్రీలపై ఎక్కడా భద్రత లేకుండా పోయింది. ఆఖరికి రక్షించాల్సిన ఖాకీలూ సైతం కామవాంఛతో వారిపై వేధింపులకు పాల్పడుతున్నారు. అలాంటి వేధింపులకు పాల్పడిన చర్లపల్లి సెంట్రల్ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ చింతల దశరథంపై బదిలీ వేటు పడింది. ములాకత్ కు వచ్చే ఖైదీల భార్యలను వేధిస్తున్నాడని దశరథంపై ఆరోపణలు రావడంతో జైళ్ల శాఖ డీజీ జితేందర్ చర్యలు తీసుకున్నారు. తమను వేధిస్తున్నాడంటూ ఖైదీల భార్యలు జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన ఉన్నతాధికారులు విషయాన్ని డీజీ వద్దకు తీసుకువెళ్లారు.

దీనిపై స్పందించిన ఆయన పరిపాలనకు భంగం కలిగిస్తున్నాడనే ఆరోపణలపై సూపరింటెండెంట్ దశరథం పై చర్యలకు ఆదేశించారు. చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి చర్లపల్లి వ్యవసాయ క్షేత్రానికి చింతల దశరథంను బదిలీ చేశారు. అయితే గతంలో జైలులో పనిచేస్తున్న మహిళా సిబ్బంది పై లైంగికంగా వేధించిన ఘటనలో దశరథంపై కుషాయిగూడ పోలీస్ స్టేషన్‭లో కేసు నమోదైంది. మరోసారి ఇలాంటి ఆరోపణలు వస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని దశరథానికి హెచ్చరికలు చేశారు ఉన్నతాధికారులు.
police harassment prisoners wife
Breaking News, Latest News, Physically Harassment, Charlapally Jail

Read more RELATED
Recommended to you

Latest news