బీజేపీ పోరుబాట.. కార్యచరణ ప్రకటించిన చీఫ్‌ కిషన్‌ రెడ్డి

-

బీజేపీ ఇవాళ మహా ధర్నా పేరిట ఇందిరా పార్క్‌ వద్ద నిరసన తెలిపిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ధర్నాలో బీజేపీ చీఫ్‌ కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ పై తెలంగాణ బీజేపీ పోరుబాట పట్టిందన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని నిర్ణయించిందని, ఇందులో భాగంగానే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేస్తూ.. శనివారం (ఆగస్టు 12వ తేదీన ) హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బీజేపీ మహాధర్నా చేపట్టిందని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణిపై కార్యాచరణ ప్రకటించారు కిషన్‌ రెడ్డి.

Kishan Reddy's appointment as Telangana BJP chief sets tone for saffron  push ahead of polls | News9live

ఆగస్టు 16, 17వ తేదీల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం బస్తీల్లో పర్యటించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బస్తీల్లో నిరుపేదలను కలిసి.. వారి సమస్యలను తెలుసుకోవాలని, దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఆగస్టు18వ తేదీన మండల కేంద్రాల్లో ధర్నాలు చేపట్టాలని నిర్ణయించారు. ఆగస్టు 23, 24 తేదీల్లో జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల దగ్గర నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. సెప్టెంబర్ 4వ తేదీన హైదరాబాద్ లో విశ్వరూప ధర్నా చేపట్టాలంటూ పార్టీ శ్రేణులను కిషన్ రెడ్డి ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news