MMTS ఫేజ్‌-2కు ఎందుకు సహకరించట్లేదు.. కేసీఆర్ కు కిషన్‌రెడ్డి ప్రశ్న

-

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతున్న కేంద్రానికి తెలంగాణ సర్కార్ సహకరించడం లేదని ఆరోపించారు. ముఖ్యంగా.. ఘట్‌కేసర్‌ నుంచి యాదాద్రి వరకు నిర్మించాలనుకుంటున్న ఎంఎంటీఎస్‌ ఫేజ్‌-2కు కేసీఆర్ ప్రభుత్వం సహకరించడంలేదని మండిపడ్డారు.

భూసేకరణ పనులు ఎంత తొందరగా ప్రారంభిస్తే అంతే త్వరగా పనులు చేపడతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తాను లేఖ రాసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఎంఎంటీఎస్‌ లైన్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందడం లేదన్నారు. ఎంఎంటీఎస్‌ ఫేజ్‌-2 విషయంలో ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ చొరవ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బర్కత్‌పురాలోని యాదాద్రి భవన్ నుంచి యాదగిరిగుట్టకు బయల్దేరిన అఖండ జ్యోతియాత్రను కిషన్‌ రెడ్డి ప్రారంభించారు. అఖండ జ్యోతి వెళ్లే మార్గంలో అన్ని వర్గాల ప్రజలు జ్యోతిని దర్శించుకుని స్వామి వారి ఆశీస్సులు పొందాలన్నారు. కొత్త దేవాలయాలను నిర్మించడం కన్నా ఉన్న ఆలయాల్లో సౌకర్యాలను మెరుగుపరిచి పూజా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version