ఫామ్ హౌజ్ లో కూర్చుని అబద్దాలు ఆడవద్దని ,ఢిల్లీలో ధర్నాలు చేస్తే ఎవరం భయపడం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలకు అనుగుణంగానే పెట్రోల్ రేట్లను కేంద్రం పెంచిందని కేంద్రమంత్రి తెలిపారు. కరోనా సమయంలో ఆర్థిక వ్యవస్థ పరిస్థితుల వల్ల పెట్రోల్ ధరలు పెరిగాయని.. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి మెరుగవ్వడంతో పెట్రోల్, డిజిల్ ధరను తగ్గించామని కిషన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రాలు కూడా తగ్గించుకోవాలని కేంద్రం కోరిందని గుర్తు చేశారు. బీజేపీ రాష్ట్రాలతో పాటు ఒడిశా వంటి బీజేపేతర రాష్ట్రాలు కూడా పెట్రోల్ ధరలను తగ్గించాయన్నారు. కరోనా లేని సమయంలో వ్యాట్ పెంచింది మీరే అని కేసీఆర్ ప్రభుత్వాన్ని గురించి విమర్శించారు.
దేశం రక్షణ కోసం, ఇతర అవసరాల కోసం తప్పకుండా ఖర్చు చేయాల్సి ఉంటుందని అన్నారు. కరోనా సమయంలో పీపీఈ కిట్లు, ప్రస్తుతం ఉచిత వ్యాక్సిన్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం కాదా..అని ప్రశ్నించారు. వైద్య కళాశాల ఇవ్వలేదని టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తుందని.. మీరెప్పుడైనా మెడికల్ కళాశాల గురించి కేంద్రాన్ని అడిగారా..? బీబీనగర్ లో మెడికల్ కాలేజీ ఇచ్చింది కేంద్రం కాదా..అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి.