బాలకృష్ణ మండలికి తాగోచ్చారు, బ్రీత్ టెస్ట్ చెయ్యాలి…!

-

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా మంత్రి కొడాలి నానీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. మండలిలో జరిగిన వ్యవహారాలను ప్రస్తావిస్తూ నానీ విరుచుకుపడ్డారు. గ్యాలరీలో చంద్రబాబు నాలుగు గంటలు కూర్చున్నారన్న ఆయన సిగ్గు లేకుండా అక్కడి నుంచి ఛైర్మన్‌కు డైరెక్షన్స్ ఇచ్చారని మండిపడ్డారు. జగన్ దెబ్బకు 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు మండలి గ్యాలరీ ఎక్కారని,

40 ఏళ్లు అనుభవం, 14 ఏళ్లు ముఖ్యమంత్రి, పదేళ్లు ప్రతిపక్ష నాయకుడినని చెప్పుకునే చంద్రబాబు జగన్ దెబ్బకు మండలి గ్యాలరీ ఎక్కి కూర్చున్నారని చలోక్తులు విసిరారు. నెక్ట్స్ టైమ్ అసెంబ్లీ గ్యాలరీ ఎక్కించాలని సీఎం జగన్‌ ననీ విజ్ఞప్తి చేసారు. మంత్రులు తాగొచ్చారని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అంటున్నారని, కానీ చంద్రబాబు, బాలకృష్ణ వచ్చాకే మండలిలో మందు వాసన వచ్చిందన్నారు.

మంత్రులు తాగారు, జర్దాలు నమిలారని యనమల రామకృష్ణుడు ప్రెస్‌మీట్‌లో చెప్పారని, మేం అసెంబ్లీ నుంచి మండలికి అటుఇటూ తిరుగుతూనే ఉన్నామని, ఇక్కడ రాని వాసన మండలిలో ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. మాకు కూడా అనిపించింది అంటూ, చంద్రబాబు, ఆయన బావమరిది బాలకృష్ణ గ్యాలరీలోకి వచ్చాక మందు వాసన వచ్చిందని, చంద్రబాబు తాగొచ్చారో.. లేదంటే టీడీపీకి సంబంధించిన వాళ్లు ఎవరైనా తాగొచ్చారో.. యనమల రామకృష్ణుడు తేల్చాలని, బ్రీత్ అనలైజర్ పెట్టి మందు వాళ్లను పరీక్షించాలని ఆయన సవాల్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news