వలస వెళ్లింది ప్రజలు కాదు, నారావారిపల్లె నుంచి చంద్రబాబు, లోకేశ్ లే : కొడాలి నాని

-

మరోసారి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కొడాలి నాని. తాజాగా ఆయన మాట్లాడుతూ.. యువగళం పాదయాత్రలో లోకేశ్ నోరు పారేసుకుంటున్నారని, జగన్ ను ఒరేయ్, అరేయ్ అంటున్నారని మండిపడ్డారు. కనీసం మంగళగిరిలో ఓ అభ్యర్థిగా గెలవలేని లోకేశ్ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు కొడాలి నాని. లోకేశ్ పాదయాత్రలో కనీసం 10 కిలోమీటర్లు కూడా నడవలేకపోతున్నాడని ఎద్దేవా చేశారు కొడాలి నాని. గతంలో లోకేశ్ స్కూలు పిల్లలతో జూమ్ మీటింగ్ నిర్వహించాడని, ఆ మీటింగ్ లోకి తాను, వల్లభనేని వంశీ ఎంటరయ్యేసరికి లోకేశ్ తెల్లముఖం వేశాడని వ్యంగ్యం ప్రదర్శించారు కొడాలి నాని. పాదయాత్ర సందర్భంగా, పలు గ్రామాల్లోని ప్రజలు వలస వెళ్లారని లోకేశ్ అంటున్నాడని, వలస వెళ్లింది ప్రజలు కాదని, నారావారిపల్లె నుంచి చంద్రబాబు, లోకేశ్ లే వలస వెళ్లారని కొడాలి నాని విమర్శించారు కొడాలి నాని.

వీళ్లకుతోడు దత్తపుత్రుడు కూడా తయారయ్యాడని, ఏపీకి వచ్చినప్పుడల్లా… నేను ఇక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను, ఇక్కడ చదువుకున్నాను అని చెబుతుంటాడని, ఆ దత్తపుత్రుడు కూడా వలస వెళ్లాడని అన్నారు. వీళ్లందరికీ జగన్ పై పడి ఏడవడంతప్ప మరో పని లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శునకానందం పొందుతున్నారని విమర్శించారు కొడాలి నాని. “బాబాయ్ ని గొడ్డలితో కొట్టారని మీరు చెబుతారు… మరీ మీ బాబాయ్ ఎక్కడున్నాడో ఓసారి మీడియా ముందుకు తీసుకురా” అంటూ లోకేశ్ ను ఉద్దేశించి నాని వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసు గురించి మాట్లాడుతూ… ఈ కేసులోకి వైఎస్ భారతమ్మను అనవసరంగా లాగుతున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news