షర్మిల పార్టీ మీద కొడాలి నాని ఆసక్తికర కామెంట్స్ చేశారు. తిరుపతి ఎన్నికల్లో దొంగ ఓట్ల గురించి మాట్లాడిన ఆయన అసలు తిరుపతిలో దొంగ ఓట్లు పడలేదని అన్నారు. తెలంగాణలో మేము దృష్టి సారించలేదు అని పేర్కొన్న ఆయన షర్మిల పెట్టబోతున్న పార్టీ గురించి ఏమీ చెప్పలేనని అన్నారు. ఇక తిరుపతిలో పోలింగ్ 50 శాతమే జరిగిందని మంత్రి కొడాలి నాని అన్నారు.
చంద్రబాబు చెప్పినట్లు బస్సుల్లో వచ్చి దొంగ ఓట్లు వేసి ఉంటే పోలింగ్ 80 శాతం 90 శాతం గాని జరిగి ఉండాలి… కానీ అలా ఏమి జరగలేదని అన్నారు. తిరుపతి ఎన్నికల్లో వైసీపీ కచ్చితంగా గెలుస్తుందని అన్నారు. 4 లక్షల 50 వేల మెజారిటీతో వైసీపీ గెలుపు ఖాయం అని మంత్రి కొడాలి నాని అన్నారు. కరోన నియంత్రణకు లాక్ డౌన్ పరిష్కారం కాదు.. ప్రజలు మాస్కులు ధరించి శానిటైజర్ వాడటం సామాజిక దూరం పాటించి అప్రమత్తంగా ఉండాలని అన్నారు.