జగన్ మరో 30 ఏళ్లు.. కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

-

జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీలకు పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. బీసీలకు ఏకంగా భారీగా రిజర్వేషన్లు కూడా ప్రకటించారు. ఇక ఇటీవలే విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కృష్ణా జిల్లా బీసీ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్లు కూడా మంత్రులు ఎమ్మెల్యేలు సన్మానం చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో పలువురు మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు పార్టీ శ్రేణులు కూడా పాల్గొన్నారు.

ఇక ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ మంత్రి కొడాలి నాని ఓ వైపు ప్రతిపక్ష టిడిపిపై విమర్శలు గుప్పించడం తో పాటు సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు. గతంలో చంద్రబాబు కేవలం బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటే ప్రస్తుతం సీఎం జగన్ మాత్రం బీసీల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు. మరో 30 ఏళ్లపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి గా ఉంటారు అంటూ ధీమా వ్యక్తం చేశారు ఏపీ మంత్రి కొడాలి నాని.

Read more RELATED
Recommended to you

Exit mobile version