ఏపీ రాజకీయాల్లో బాగా స్పెషల్ గా కనిపించే నియోజకవర్గాల్లో గుడివాడ కూడా ఒకటి..ఈ నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ గానే నడుస్తాయి. ఒకప్పుడు ఎన్టీఆర్ ఇక్కడ పోటీ చేసి విజయం సాధించడంతో…ఈ నియోజకవర్గంపై అందరి దృష్టి ఉంటుంది. అయితే మొదట నుంచి గుడివాడ టీడీపీకి కంచుకోటగానే ఉంటూ వచ్చింది..కానీ ఎప్పుడైతే కొడాలి టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్ళి వరుసగా విజయాలు సాధిస్తున్నారో అప్పుడు పరిస్తితి మారిపోయింది.
2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచి కొడాలి నాని గుడివాడని తన కంచుకోటగా మార్చుకున్నారు…ఇక కొడాలి నాని దెబ్బకు గుడివాడలో టీడీపీ పరిస్తితి దారుణంగా తయారైంది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక కొడాలి ఏ స్థాయిలో చంద్రబాబుని టార్గెట్ చేసి తిడుతున్నారో అందరికీ తెలిసిందే…బాబుని కొడాలి నాని తిట్టినట్లుగా మరొకరు తిట్టరనే చెప్పొచ్చు. ఇలా బాబుని తిడుతున్న కొడాలికి చెక్ పెట్టాలని చెప్పి..టీడీపీ శ్రేణులు బాగా కసితో ఉన్నాయి. అయితే ఎంత కసి ఉన్నా…గుడివాడలో కొడాలిని ఓడించడం అంత సులువు కాదు..పైగా అక్కడ టీడీపీకి బలమైన నేత కనిపించడం లేదు.
ఇప్పటికే రెండుసార్లు అభ్యర్ధులని మార్చారు…మూడో సారి కూడా అభ్యర్ధులని మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ సారి అభ్యర్ధి మార్పు ఉండదని టీడీపీ అధిష్టానం నుంచి సంకేతాలు అందుతున్నాయి. ప్రస్తుతం ఇంచార్జ్ గా ఉన్న రావి వెంకటేశ్వరావుకే సీటు దక్కుతుందని ఇటీవల మినీ మహానాడులో సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్పష్టతనిచ్చారు.
ఈ సారి అభ్యర్ధి మార్పు ఉండదని ఖచ్చితంగా రావికే సీటు అని…చంద్రబాబు మాటగా తాను చెబుతున్నానని అయ్యన్న చెప్పుకొచ్చారు. ఇక దీని బట్టి చూస్తే ఈ సారి గుడివాడలో కొడాలిపై పోటీ చేసేది రావి అని అర్ధమవుతుంది. మరి రావి ..కొడాలిని నిలువరించగలరో లేదో చూడాలి. అంత ఈజీగా కొడాలిని ఓడించడం కష్టమనే చెప్పాలి. మరి ఈ సారి గుడివాడలో పోలిటికల్ సీన్ మారుతుందో లేదో.